Jetty Hero Krishna Manyam: మా బావ, మహేష్ బాబు సినిమాలో ఆఫర్ ఇస్తాడేమో అనుకున్నా.. యంగ్ హీరో ఇంటరెస్టింగ్ కామెంట్స్
Jetty Movie Hero : తనకు మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ బావ అవుతారని చెప్పుకొచ్చారు జెట్టి సినిమా హీరో మాన్యం కృష్ణ. తనకు అయన మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇప్పిస్తారని అనుకున్నానని కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి
Jetty Movie Hero about his Background: సినీ పరిశ్రమ మీద ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి, ఎలా అయినా ఆ పరిశ్రమలో భాగమవ్వాలి అంటూ అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మనకు సినీ పరిశ్రమలో తెలిసిన వారు కానీ బంధువులు కానీ ఉన్నారంటే ఇక ఆ ప్రయత్నాలు నెక్స్ట్ లెవల్ కు వెళుతూ ఉంటాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బావమరిది అయ్యే వ్యక్తి ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నారు.
వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచుక దర్శకత్వంలో జెట్టి అనే సినిమా తెరకెక్కింది. మాన్యం కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయిన్ గా నటించగా శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో కృష్ణ మాన్యం తమది చిత్తూరు జిల్లా అని, చిన్నతనంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మానేసి.. హైదరాబాద్ వచ్చానని చెప్పుకొచ్చారు.
దూరదర్శన్ కోసం ఒక ఎపిసోడ్... ఈటీవీ కోసం తూర్పు వెళ్లే రైలు సీరియల్‌లో మూడు ఎపిసోడ్స్‌లో నటించానన్న ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐటీ జాబ్స్ చేశా కానీ మససంతా సినిమాపైనే ఉందని చెప్పుకొచ్చారు. గల్లా జయదేవ్ కుటుంబంతో మాకు దగ్గరి సంబంధం ఉందని బావ వరసయ్యే గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ చెన్నైలో పాండ్యన్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకుంటుంటే నేను కూడా గల్లా అశోక్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నానని కృష్ణ చెప్పుకొచ్చారు.
తరువాత జాబ్ చేస్తూ సోషల్ వర్క్ చేస్తుంటే ఆ సోషల్ వర్క్ చూసి మా బావ గల్లా జయదేవ్ ఇంప్రెస్ అయి మహేష్ బాబు సినిమాలో ఆఫర్ ఇస్తాడేమో అని అనుకునేవాడినన్న ఆయున అలాంటి పరిస్థితుల్లో హీరో కోసం వెతుకుతున్న ఓ నిర్మాత.. నన్ను చూసి ఓ లవ్ స్టోరీలో ఆఫర్ ఇచ్చారని, చిన్న సినిమాకు ఉండే కష్టాల మాదిరిగానే.. నా తొలి సినిమా రిలీజ్ ఆగిపోయిందని కృష్ణ మాన్యం చెప్పుకొచ్చారు. ఆ సినిమా రిలీజ్ ఆలస్యమైన సమయంలో.. టెన్షన్లో ఉండగా జెట్టీ మూవీలో ఆఫర్ ఇచ్చారని అన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది నవంబర్ 4న తేలనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook